వరంగల్ శివనగర్ లోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, నూతన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులకు రాష్ట్ర, దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ మేయర్ గుండు సుధారాణి తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జి డబ్ల్యు ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్ చింతాకుల అనిల్, ఇంచార్జ్అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.