వరంగల్ ఎంజీఎంలో బయో మెడికల్ వేస్టేజ్

82చూసినవారు
వరంగల్ ఎంజీఎం అధికారుల నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. ఆస్పత్రిలోని ఓ వార్డు పక్కనే ఆదివారం వినియోగించిన ఇంజక్షన్ బాటిళ్లు, నీడిల్స్ పడేయడంతో రోగులు ఆందోళన చెందారు. ఆస్పత్రిలోని బయో మెడికల్ వేస్టేజీని తరలించకుండా వదిలేయడంతో చికిత్స కోసం వచ్చిన వారి జబ్బులు ఎలా నయమవుతాయని పలువురు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్