భవన నిర్మాణాలతో పాటు సామజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రెడాయి సంస్థ సభ్యులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభినందించారు. ఆదివారం హనుమకొండలో క్రెడాయి సంస్థ యూత్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలనీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆరోగ్యావంతమైన సగటు మానవులు ఏడాదిలో కనీసం నాలుగు సార్లు రక్తదానం చేయాలనీ కోరారు.