హన్మకొండ జిల్లా కాజీపేట మండలం గురువారం మడికొండ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పరీక్షల ఫలితాలను వెంటనే రద్దు చేయాలని సిపిఐ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. సిపిఐ జిల్లా కార్యదర్శి మద్దెల ఎల్లేష్ మాట్లాడుతూ 67 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చిందని బీహార్ రాష్ట్రంలో పరీక్ష పత్రాన్ని లీక్ చేసి 30 లక్షల చొప్పున అమ్ముకున్నారని, ఇది చాలా సిగ్గుచేటు అని అన్నారు.