పెత్రామావాస్య బతుకమ్మ పండుగ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

355చూసినవారు
పెత్రామావాస్య బతుకమ్మ పండుగ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రో. జయశంకర్ ఏకశిలా పార్క్ బాలసముద్రం, హనుమకొండలో పెత్రమావాస్య బతుకమ్మ పండుగను నిర్వహించుటకు నిర్ణయించారు. ఈ వేడుకలు ఏకశిలా పార్క్-శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఉత్తరం వైపు వేడుకలకు అనుకూలంగా లైటింగ్, సౌండ్ సిస్టం, మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. బతుకమ్మలలో ఎంపిక చేసిన బతుకమ్మలకు సంబంధించిన వారికి బహుమతులు, కోలాటంలో పాల్గొన్న మహిళలలో నైపుణ్యం ప్రదర్శించిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది.

ఈ వేడుకలకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రాలను వరంగల్ (పశ్చిమ) ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినాయ భాస్కర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ బాధ్యులు శ్రీ రెంటాల కేశవరెడ్డి, చాడ దశరథ రామిరెడ్డి, పచ్చిమట్ల ఎల్లా గౌడ్, పడాల సోమయ్య, వంగ రాజిరెడ్డి, ఫోటు అరుణారెడ్డి, కుందారపు అరుణ తదితరులు పాల్గొన్నారు.