ధాన్యం కొనుగోలు, చెల్లింపు అంశాలపై సమీక్షా
By రాజీ 77చూసినవారుకొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలని, అలసత్వం వహించరాదని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రైస్ మిల్లర్స్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఏకేపి, పౌరసరఫరాలు, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2024`-25 వానాకాలం ధాన్యం కొనుగోలు, చెల్లింపు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.