కట్టుకున్న భార్యను చంపిన భర్త
వర్ధన్నపేట మండలం చెన్నారంలో దారుణం జరిగింది. మానసిక స్థితి కోల్పోయిన భర్త భార్యను కడతేర్చాడు. మామునూరు సీఐ రవికిరణ్ కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే హైదర్ కొంత కాలంగా మానసిక స్థితి కోల్పోయి తిరుగుతున్నాడు. కొద్దిరోజులుగా ఎవరూ కనిపించినా చంపుతానంటూ బెదిరిస్తున్నాడు. మంగళవారం భార్యతో గొడవపడిన అతను టవల్‌తో గొంతు నులిమి చంపేశాడు. దీంతో శ్వాస ఆడక ఆమె ఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.