వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో కొండపర్తి, వనమాలకనపర్తి, నర్సింహులగూడెం, ముల్కలగూడెం గ్రామాల పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పట్టభద్రులు టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించి దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.