మైక్రోసాఫ్ట్ యూజర్లకు భారత ప్రభుత్వం బుధవారం హై రిస్క్ అలర్ట్‌ను జారీ చేసింది. బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. 129.0.2792.79 ముందు వెర్షన్లలో భద్రతా లోపాలు ఉన్నాయని CERT-In తెలిపింది. ఇవి సెక్యూరిటీ కంట్రోల్స్‌ను బైపాస్ చేసి ఫోన్లు, కంప్యూటర్లలో రిమోట్ అటాకర్స్, సైబర్ క్రిమినల్స్ తమ సొంత కోడ్‌ను జొప్పించేందుకు అవకాశం కల్పిస్తాయంది. మలీషియస్ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ చేసి పర్సనల్ డేటా చోరీకి సాయపడతాయని హెచ్చరించింది.