పేపర్ లీక్ ఛానళ్లను బ్లాక్ చేశాం: టెలిగ్రామ్

82చూసినవారు
పేపర్ లీక్ ఛానళ్లను బ్లాక్ చేశాం: టెలిగ్రామ్
UGC నెట్ ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్న ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రామ్ ప్రకటించింది. ఈ కేసులో శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటామని, విచారణలో అధికారులకు సహకరిస్తామని తెలిపింది. తమ హెల్ప్‌డెస్క్‌లో ఎలాంటి ఫిర్యాదు వచ్చినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టెలిగ్రామ్ ద్వారానే పేపర్ లీక్ అయిందన్న వార్తలపై కంపెనీ స్పందించింది.