మా ఉత్పత్తుల్లో చక్కెరను 30% తగ్గించాం: నెస్లే

59చూసినవారు
మా ఉత్పత్తుల్లో చక్కెరను 30% తగ్గించాం: నెస్లే
అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, వెనకబడిన ఆఫ్రికా దేశాల్లో నెస్లే నుంచి వచ్చే బేబీ ఫుడ్‌ ఉత్పత్తుల్లో అధిక చక్కెర వాడుతున్నారన్న ఆరోపణలపై ‘నెస్లే ఇండియా’ స్పందించింది. భారత్‌లో తయారు చేస్తున్నఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత 5 ఏళ్లలో 30% తగ్గించినట్లు పేర్కొంది. ఇండియాలో నెస్లే విక్రయిస్తున్న 15 రకాల సెరిలాక్‌ ఉత్పత్తుల్లో ఒక్కో సర్వ్‌లో 2.7 గ్రాముల చక్కెర ఉంటున్నదని తెలిపింది.

ట్యాగ్స్ :