దేశంలోనే 2వ పెద్ద మెట్రో.. హైదరాబాద్ మెట్రో

61చూసినవారు
దేశంలోనే 2వ పెద్ద మెట్రో.. హైదరాబాద్ మెట్రో
హైదరాబాదు నగరంలో వేగవంతం, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలను మెట్రో రైలు ప్రాజెక్టు అందిస్తోంది. 2017లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో.. 2018లో ఎల్‌బి నగర్ - అమీర్‌పేట.. 2019లో అమీర్‌పేట-హైటెక్ సిటీ.. 2020లో జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ మెట్రో.. దేశంలోనే రెండవ పెద్ద మెట్రోగా గుర్తింపు పొందింది. కాగా, ఈ మెట్రోలో ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

సంబంధిత పోస్ట్