ట్రూకాలర్‌లో వెబ్‌ వెర్షన్‌.. పీసీలోనూ కొత్త నంబర్ల వివరాలు వెతకొచ్చు

61చూసినవారు
ట్రూకాలర్‌లో వెబ్‌ వెర్షన్‌.. పీసీలోనూ కొత్త నంబర్ల వివరాలు వెతకొచ్చు
కాంటాక్టుల్లో లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించేందుకు ఉపయోగించే ట్రూకాలర్.. యూజర్ల కొసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాట్సప్‌, టెలిగ్రామ్‌ తరహాలో ‘ట్రూ కాలర్‌ వెబ్‌’ను పరిచయం చేసింది. దీనిద్వారా మీ మొబైల్‌ను డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లకు కనెక్ట్ చేసుకొని వాటిలోనూ సెర్చ్‌ చేసి గుర్తుతెలియని నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు. కాగా ఈ సదుపాయం ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్