రాహుకేతువులను జ్యోతిష్య శాస్రంలో ఛాయా గ్రహాలు అంటారు. వీటికి జ్యోతిష్య శాస్రంలో ఇల్లు లేదు. రాహుకేతువులు అపసవ్య మార్గంలో ప్రయాణిస్తాయి. రాహువు కేతువుకు సరిగ్గా ఏడు రాశుల దూరంలో ప్రయాణం చేస్తాయి. కనుక ఈ రెండు గ్రహాలు ప్రయాణకాలం సమంగానే ఉంటుంది. రాహువును కాలసర్పంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో రాహువు కేతువుకు మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.