డ్రిప్ ప్రైసింగ్ పై జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

85చూసినవారు
డ్రిప్ ప్రైసింగ్ పై జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
'డ్రిప్ ప్రైసింగ్' టెక్నిక్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఏదైనా వస్తువుకు సంబంధించిన ప్రకటన ఇచ్చినప్పుడు ఒక ధరను చూపించి, చివరిగా పేమెంట్ దగ్గరకు వెళ్లేసరికి వివిధ ఛార్జీలను జోడించి ఆ వస్తువు ధరను పెంచడాన్నే 'డ్రిప్ ప్రైసింగ్' టెక్నిక్ అంటారు. ఇలాంటి మోసాల బారిన పడితే కన్స్యూమర్ హెల్ప్ లైన్ 1915ను సంప్రదించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
Job Suitcase

Jobs near you