తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కొత్త అధ్యక్షురాలిని నియమించాలని ఇటీవల ఏఐసీసీ కసరసత్తు మొదలు పెట్టింది. దీంతో ఆ పోస్టు కోసం రాష్ట్రంలోని మహిళా నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గద్వాల్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, బడంగ్ పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డిల మధ్య పోలీ నెలకొంది. అయితే బీసీ ఈక్వేషన్లో సరితా పేరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని ఏఐసీసీకి చెందిన ఒక నేత తెలిపినట్లు సమాచారం.