భర్తను వంట చేయమన్న భార్య.. నిరాకరించాడని ఉరేసుకుని ఆత్మహత్య

1014చూసినవారు
భర్తను వంట చేయమన్న భార్య.. నిరాకరించాడని ఉరేసుకుని ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. బాల్ కిషన్ యాదవ్, కవితలకు ఇటీవలే పెళ్లైంది. ఇక భర్తను పోహా వంటకం చేయమని కవిత కోరింది. అందుకు బాల్ కిషన్ నిరాకరించాడు. పోహాకు బదులుగా భార్యకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చి తినాలని కోరాడు. దీంతో వారికి గొడవ జరిగింది. క్షణికావేశంలో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని కవిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్