రాజకీయాల నుంచి తప్పుకుంటా: కర్ణాటక సీఎం

263208చూసినవారు
రాజకీయాల నుంచి తప్పుకుంటా: కర్ణాటక సీఎం
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రస్తుతం తన వయసు 77 ఏళ్లని, నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల నాటికి పని చేసేందుకు అవసరమైన ఆరోగ్యం, ఉత్సాహం ఉండదన్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.