స్కామర్ ఫోన్ కాల్‌తో ఆగిన మహిళ గుండె

68చూసినవారు
స్కామర్ ఫోన్ కాల్‌తో ఆగిన మహిళ గుండె
స్కామ్ ఫోన్ కాల్‌తో ఓ మహిళ గుండె ఆగింది. ఈ విషాదకర ఘటన ఆగ్రాలో చేటు చేసుకుంది. ప్రభుత్వ టీచర్ మాలతి వర్మకు పోలీస్ ఫోటో డీపీతో ఓ స్కామర్ వాట్సాప్ కాల్ చేశాడు. మీ కూతురు సెక్స్ రాకెట్‌లో పట్టుబడిందని, రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తానని మాలతి వర్మకు స్కామర్ చెప్పాడు. ఆ వార్త విన్న మాలతి వర్మ తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్