కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ఇందుకు అడ్డుగా ఉన్న కౌంటర్ లాక్, స్కై వాక్ లను భారీ క్రేన్లతో శుక్రవారం సాయంత్రం తొలగించారు. ఇప్పటికే గేటులోని 3 ఎలిమెంట్లు డ్యాం వద్దకు చేరుకోగా, మరో 2 రావాల్సి ఉందని చెప్పారు. గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.