వికారాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనంలో పురుగుల బియ్యం (వీడియో)

61చూసినవారు
విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు పట్టిన బియ్యాన్ని వండుతున్న ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గుండుమాల్ మండలంలోని ఓ పాఠశాలలో విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు పట్టిన బియ్యాన్ని వండుతున్నారు. ఈ అన్నాన్ని తినలేక విద్యార్థులు ఇంటిదగ్గర నుంచే భోజనం చేసి వెళ్తున్నారని, 10నెలల నుంచి ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్