తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి వేలాదిగ భక్తులు తరలివచ్చారు. భజనలు, కోలాటాలతో గిరి ప్రదక్షిణ సాగింది.