

యాదగిరిగుట్ట: కుంభాభిషేక మహోత్సవానికి సిద్ధమైన ఆలయం
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణమయ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవ యాగానికి యాదాద్రి క్షేత్రం సిద్ధమైంది. రంగురంగుల విద్యుత్ కాంతుల వెలుతురులతో దేదిప్యమాన్యంగా పంచనారసింహ క్షేత్రం వెలిగిపోతుంది. పంచకుండాలు, వేదిక, యాగశాల కు విద్యుద్దీపాలంకరణ తో విరజల్లుతుంది.