జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే. గంగాధర్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి. బెన్ షాలోమ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.