రౌడీ షీటర్‌ను చేతులు కట్టేసి ఊరేగించిన పోలీసులు (వీడియో)

66చూసినవారు
రాజస్థాన్‌లోని భూద్వారాలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ప్రజలను భయాందోళనకు గురి చేసిన ఓ రౌడీ షీటర్ ను చేతులు కట్టేసి పోలీసులు గ్రామం మొత్తం ఊరేగించారు. ప్రజలలో భయాందోళనలు పోగట్టడానికి ఈ ఊరేగింపు చేపట్టామని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజ్‌పాల్ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నిందితుడికి పోలీసులు తగిన బుద్ధి చెప్పారని కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్