అంగన్‌వాడీలో చిన్నారులు తినే కోడిగుడ్లలో పురుగులు (షాకింగ్ వీడియో)

564చూసినవారు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామ అంగన్వాడీలో పంపిణీ చేసిన కోడి గుడ్లలో పురుగులు కనిపించాయి. అంగన్వాడీ సెంటర్ నుండి కోడిగుడ్లను ఇంటికి తెచ్చి చూడగా లార్వా తరహా పురుగులు కనిపించడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు. గర్భిణులు, చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహారం ఇదేనా అంటూ సంబంధిత అధికారుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్