తెలంగాణలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ‘ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు’ ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు వేడుకల్లో భాగంగా తంగేడు, గునుగు, బంతి, పట్నం బంతి, పట్టుకుచ్చు, తామర పువ్వు, గుమ్మడి పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. రాష్టంలోని మహిళలంతా బతుకమ్మను పేర్చి సంబురాలు చేసుకుంటున్నారు. భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ.. పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు.