జికా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని పుణేలో ఇప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. దీని మూలంగా ఒకరు అరుదైన మెదడు పొరల వాపు(మెనింగోఎన్‌కెఫలైటిస్) బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. మనదేశంలో జికా ఇన్‌ఫెక్షన్‌తో ఈ సమస్య తలెత్తటం ఇదే తొలిసారి. సాధారణంగా ఇలాంటి కేసులు బ్రెజిల్, అమెరికాలో కనిపిస్తుంటాయి. జికా ఇన్‌ఫెక్షన్ చాలావరకూ మామూలుదే అయినా కొందరిలో తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కాబట్టి దీనిపై అవగాహన అవసరం.