మాంసం దుకాణాలకు జరిమానా

గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో మాంసం, చేపలు విక్రయించకూడదని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేసారు. జీవీఎంసీ 50వ వార్డులో శానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో.. మాంసం, చేపలు దుకాణలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా మాంసం, చేపలు విక్రయించిన దుకాణాలపై శానిటరీ ఇన్స్పెక్టర్ అపరాధ రుసుము విధించి, తక్షణమే దుకాణలను మూసి వేయించారు.

సంబంధిత పోస్ట్