జీవీఎంసీ 93 నుంచి 98 వరకు గల వార్డుల పరిధిలో సమస్యలపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వేపగుంట జీవీఎంసీ సమావేశ మందిరంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. తాగునీరు, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ తదితర సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 96వ వార్డ్ కార్పొరేటర్ పీలా శ్రీనివాస రావు పాల్గొన్నారు.