గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం మంజూరు చేసిన రూ. 3వేల కోట్లతో జగన్, ప్రభుత్వ భవనాలు కార్యాలయాలకు వైసిపి రంగులు వేశాడని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. మంగళవారం సబ్బవరం మండలం గొట్టివాడలో పల్లె పండగ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గండి బాబ్జి పాల్గొన్నారు.