దేశవ్యాప్తంగా రూ. లక్ష కోట్లతో రైల్వే ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నట్లు రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ మూడు లైన్లుగా ఉన్న విశాఖ చెన్నై రైల్వే ట్రాక్ ను నాలుగు లైన్లుగా మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కు భూమి పూజ చేస్తామన్నారు.