ప్రజా ఆరోగ్యం పై దృష్టి సారించాలి : ఎంపీపీ గోవింద్

ప్రస్తుతం వ్యాధుల సమయం కావడంతో అప్రమత్తం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని యలమంచిలి ఎంపిపి బోడేపు గోవింద్ అన్నారు. శుక్రవారం రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ ఉన్న పరికరాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు అవసరమయ్యే పరికరాలను గుర్తించాలని సూచించారు. వైద్యానికి సంబంధించిన పరికరాలను సమకూర్చేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్