తక్షణమే జీవో నెంబర్ 117 రద్దు చేయాలి: ఏపీటీఎఫ్

ప్రాథమిక విద్య నిర్వీర్యం చేసిన జివో నంబర్ 117 ను వెంటనే రద్దు చేసి.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు పూర్వ వైభవం తేవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కర్రీ ధర్మరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఎలమంచిలిలో గల వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను రాష్ట్ర మాజీ కార్యదర్శి వెంకటపతి రాజుతో కలసి సందర్శించారు. ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలుగు ఆంగ్ల మాధ్యమాలను సమాంతరంగా నడపాలని, ఓపిఎస్ విధానం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్