మంగళగిరి: టీచర్ల బదిలీల్లో రాజకీయ జోక్యం లేకుండా ప్రత్యేక యాప్‌: మంత్రి

టీచర్ల బదిలీల్లో రాజకీయ జోక్యం లేకుండా ప్రత్యేక యాప్‌ తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రయోగాలు వద్దు.. ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులను కోరారు. సాంకేతికతతో విద్యావ్యవస్థలో సత్ఫలితాలకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రంతో పంచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్