మంగళగిరి: పానుగంటి చైతన్యను కస్టడీకి కోరిన పోలీసులు

వైసీపీ నేత పానుగంటి చైతన్యను కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి పోలీసులు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇతను ఏ 1గా ఉన్నారు. ఈకేసులో చైతన్య లొంగిపోవడంతో ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగళగిరి పోలీసులు చైతన్యను 10 రోజులు కస్టడీకి కోరగా కోర్టు రెండు రోజులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనను రేపు, ఎల్లుండి విచారించనున్నారు

సంబంధిత పోస్ట్