వైసీపీ ప్రభుత్వ పాలనలో భూములను కబ్జా చేసిన నాయకులు పేదలకు అమ్ముకున్నారని, తాడికొండ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుభాని ఆరోపించారు. ఆదివారం తాడికొండ మండలంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన పనికి పేదలు నష్టపోయారని వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి వైసీపీ గుండాలపై ల్యాండ్ గ్రాఫింగ్ కేసు నమోదు చేయాలన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేసి ఆక్రమణలు తొలగించమన్నా పట్టించుకోలేదన్నారు.