వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని నరసరావుపేట ట్రాఫిక్ సీఐ లోకనాథం అన్నారు. బుధవారం రాత్రి నరసరావుపేట పట్టణ పరిధిలో ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పలు వాహనాలకు చలనాలు విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటిస్తూ నిర్ణీత ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేయడం వలన ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.