నరసరావుపేట: నాటుసారా పూర్తిగా నిర్మూలిస్తాం

పల్నాడు జిల్లాలో నాటుసారా తయారీని పూర్తిగా అరికడతామని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం నరసరావుపేట స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన మద్యం అమలు విధానంలో కచ్చితంగా నిబంధనలు పాటించేలా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు జిల్లాలో అక్కడక్కడ ఇంకా నాటుసారా తయారీ జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్