ఇంకొల్లు: రహదారిపై ప్రమాదకరంగా గుంత

ఇంకొల్లు మండలం నాగండ్ల నుండి ఇడుపులపాడు వెళ్లే రహదారి పై లోతైన గుంత ప్రమాదకరంగా మారింది. గుంత ప్రమాదాన్ని తెలియచేసేందుకు దాని చుట్టూ కొందరు రాళ్ళను ఉంచారు. అయితే రాత్రి వేళల్లో ఆ రాళ్లు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నామని పలువురు వాహన చోదకులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్