బాపట్ల పట్టణంలోని రైతుబజార్ జమ్ములపాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాన్ని సోమవారం మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణ సీఐ అహమ్మద్ జాని కలిసి పరిశీలించారు. ఈ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలు, మందుబాబులకు అడ్డాగా మారింది అని గుర్తించి, రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని కమిషనర్ సీఐని కోరారు. అలాగే, ఈ ప్రాంతంలో పారిశుధ్యం చేపట్టి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.