ప్రతిపాడు: ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ఎరువుల దుకాణాలను శనివారం పొన్నూరు ఏడిఏ వి. రామకోటేశ్వరి సిబ్బందితో మెరుపు దాడులు చేశారు. రికార్డులను పరిశీలించి ఆయా కంపెనీల పి సి లేకుండా అమ్ముతున్న పురుగు మందులను నిలుపుదల చేశారు. రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని స్టాక్ బోర్డులో వివరాలను ఉంచాలని అనుమతులు లేని మందులను అమ్మినట్లయితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్