దరఖాస్తులను గడువు లోపల పరిష్కరించాలని ఆర్టీవో కురుభ మధులత అన్నారు. శావల్యాపురం మండలంలోని పోట్లూరు రెవిన్యూ పరిధిలో నూతనంగా నిర్మించనున్న పెట్రోల్ పంపు స్థలాన్ని, స్థానిక తహశీల్థార్ కార్యాలయాన్ని ఆర్డిఓ శుక్రవారం సందర్శించారు. అనంతరం కార్యాలయాన్ని మొత్తం కలియ తిరుగుతూ సిబ్బందితో మాట్లాడి, కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు.