సారా విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

చిత్తూరు నగరంలోని భరత నగర్ లో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న విజయ్ రాజ్ (58), అరోన్ (60), హుస్సేన్ అలీ ఖాన్ (40) అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య గురువారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8 వేలు విలువచేసే 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్రమంగా నాటు సారా విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్