సైబర్ నేరాలపై పోరాడుదామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆదివారం ఎస్పీ మాట్లాడుతూ.. మోసపూరిత ఈమెయిల్స్, లింకులతో సున్నితమైన సమాచారాన్ని దొంగలించడం, డబ్బులు కాజేయడం, దుష్ప్రచారం చేయడం వంటి నేరాలకు పాల్పడే వారిని నియంత్రిస్తామన్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత డేటాను చెప్పవద్దని ఎస్పీ సూచించారు.