చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలోని పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆదివారం ధర్నాకు దిగారు. వారు మాట్లాడుతూ, ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో దొంగలను కాకుండా అమాయకులను అరెస్టు చేశారని వాపోయారు. ఎస్ఐ తీరును నిరసిస్తూ చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై టిడిపి నేతలు రాస్తారోకో చేశారు. వార్త కోసం వెళ్లిన ఓ విలేఖరి సెల్ఫోన్ ను ఎస్ఐ లాక్కోవడం వెనుక అర్థం ఏమిటని మండిపడ్డారు.