తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, తిరుపతి మూడవ అదనపు న్యాయమూర్తి గురునాథ్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.