చిత్తూరు జిల్లా, మొగిలి ఘాట్ రోడ్ ప్రమాద ఘటన దురదృష్టకరమని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ ఈ ఘటనలో పట్ల తాను విచారణ వ్యక్తం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో గంగాధర నెల్లూరు మండలంలో ఉన్నటువంటి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా తాను కూడా వెళ్లి ఆ కుటుంబాలను కలుస్తానని చెప్పారు.