బాధిత కుటుంబానికి అండగా ఉంటాము: ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలం వేపన్జేరి పంచాయతీ నెల కాయల గుట్ట ఎస్టీ కాలనీలో ఈనెల 12న షార్ట్ సర్క్యూట్ కారణంగా జానకి, లక్ష్మీదేవిల ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ విషయం పార్టీ నేతల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ థామస్ శనివారం తక్షణ సహాయంగా రూ 10 వేలు, నిత్యవసర సరుకులను అందజేశారు. నేటి మధ్యాహ్నం బాధిత కుటుంబాలతో స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్