పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేయించాలి: కలెక్టర్

పీఎం విశ్వకర్మ పథకానికి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారితో దరఖాస్తు చేయించాలని అధికారులను కలెక్టరు నాగలక్ష్మి ఆదేశించారు. గుంటూరు కలెక్టరేట్లో నైపుణ్యాభివృద్ధి సమితి సభ్యులతో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని కలెక్టరు నిర్వహించారు. ఇప్పటి వరకు బ్యాంకర్లకు వచ్చిన దరఖాస్తులు ఎన్ని.? ఎన్ని తిరస్కరించారు.? వంటి వివరాలు అందజేయాలన్నారు. జీపీయూ ఎల్బీ కింద 63, 689 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్